AP: సీఎం చంద్రబాబు ఈనెల 17న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అక్కడ ఏర్పాటు చేయనున్న అమ్మోనియా ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత, అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.