VKB: తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి, కనుమ పండుగలు ప్రతి ఇంట ఆనందం, సంతోషం నింపాలని ఆకాంక్షించారు. రైతులకు సమృద్ధిగా దిగుబడులు రావాలని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలని కోరారు. మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని తెలిపారు. ఐక్యతతో పండుగలను జరుపుకోవాలన్నారు.