ASF: సంక్రాంతి పండుగ సందర్భంగా సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ CI బాలాజీ వరప్రసాద్ సూచించారు. పండుగ శభాకాంక్షలు అంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని కోరారు. ఆకర్షణీయమైన గ్రీటింగ్స్ లింక్‌ల ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి, బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము దోచేసే ప్రమాదం ఉందని సీఐ హెచ్చరించారు.