TG: రాష్ట్రంలో అత్యంత పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది. అన్ని వీధుల్లో కాలినడకన సందర్శించి.. గ్రామ చిత్రపటం వేస్తారు. అందులో ఏ ఇళ్లలో ఎవరు ఉంటున్నారు, వారి స్థితి గతులు ఏంటి, పక్కా, కచ్చా ఇళ్లు, గుడిసెలు, ఇలా అన్నింటిని పటంలో పెడుతారు. ప్రతి ఇంటికి ఓ స్టిక్కర్ అంటిస్తారు. ఇలా అత్యంత పేద కుటుంబాలను గుర్తిస్తారు.