మహారాష్ట్రలోని ముంబైలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులకు గాను సుమారు 1,700 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.