HYD: గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించి స్వయంగా బెలూన్ ఎగురవేశారు. సుమారు 13 కిలోమీటర్లు, గంటన్నర పాటు సాగిన ప్రయాణం మరపురాని అనుభూతి అని తెలిపారు. ఈ ఫెస్టివల్ సంస్కృతి, సాంకేతికతల సమ్మేళనంగా జరుగుతుంది.