SKLM: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ నిమ్మాడలో తన స్వగ్రామంలో కనుమ పండుగ సందర్భంగా గోసేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయంలో చేదోడుగా ఉంటున్న పశు సంపద దైవంతో సమానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.