W.G: భీమవరం నడిబొడ్డున తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీ దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపింది. అంబేద్కర్ సర్కిల్లో కిషోర్ అనే వ్యక్తి ఈ భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వెలిసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.