E.G: కొవ్వూరు మండలం ధర్మవరానికి చెందిన దాలిపర్తి వెంకటస్వామి (36) బుధవారం గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో రోడ్డు పక్కన మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చిన వెంకటస్వామి మద్యపానం ఎక్కువగా సేవించడం వల్ల అనారోగ్యానికి గురికావడంతో మృతి చెందినట్టు నిర్ధారణ చేశారు.