NDL: నందికొట్కూరులో సంక్రాంతి వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ప్రధాన వీధులన్నీ మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో కళకళలాడాయి.అల్లుళ్ళ రాకతో ప్రతి ఇంటా సందడి నెలకొనగా, ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రైతుల పండుగగా పిలిచే ఈ సంక్రాంతి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని పలువురు ఆకాంక్షించారు. పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా సంబరాలు అంబరాన్నంటాయి.