GDWL: చిన్నతాండ్రపాడు సర్పంచ్ మహేశ్వరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల కోసం పని ప్రదేశంలో అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పించాలని హెచ్చరించారు. బుధవారం గ్రామ శివారులో పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత ప్రదేశంలో పనులు చేయాలని, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు.