KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురంలో తాగునీటి పైపులైన్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయని, అయినప్పటికీ ఆరోపణలు చేయడం బాధాకరమని మున్సిపల్ వాటర్ వర్క్స్ ఏఈ సురేంద్రారెడ్డి అన్నారు. ఇస్లాంపురం ప్రాంతంలో లీకేజీలపై ఈ నెల 1న ఫిర్యాదు అందిన వెంటనే, కమిషనర్, ఇంజినీర్ ఆదేశాల మేరకు పనులు ప్రారంభించామని, ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.