ASF: కోడిపందేల స్థావరంపై దాడి చేసి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సిర్పూర్ (టి) ఎస్సై సురేష్ ప్రకటనలో తెలిపారు. మకోడి గ్రామంలో కోడి పందేలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులతో కలిసి దాడి చేశామన్నారు. ఈ దాడిలో ఆరుగురు పట్టుబడగా వారి వద్ద నుంచి 3 కోడిపుంజులు, రూ. 4100 వేల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.