HNK: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో మీడియాతో నాయిని మాట్లాడుతూ.. పేదల కోసం రూపొందించి అమలు చేస్తున్న పథకాలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.