ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఆదివారం టవర్ వర్కుల కారణంగా టౌన్-2 ఫీడర్లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏఈ రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని కాశిరెడ్డి నగర్, పవిత్ర ఏరియా, కూచిపూడి పల్లి, పామూరు రోడ్ తదితర ప్రాంతాలలో ఉదయం 7.00 గంటల నుంచి 10.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.