KRNL: ఆదోని పట్టణంలో ఇటీవల అత్యాచారం, హత్యకు గురైన జానకి కుటుంబాన్ని శనివారం ఎరిగేరి గ్రామంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బీ.తిక్కప్ప, వీరేశ్ తదితరులు పరామర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, కేసును అత్యాచారం, అట్రాసిటీ హత్యగా నమోదు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.