SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామానికి చెందిన చీకటి శ్రీరాములు జిల్లా మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావును మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.