MNCL: సీపీఐ వందేళ్ల ప్రస్థానం పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల పోరాట చరిత్రని జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ఇవాళ సీపీఐ 100 సంవత్సరాల పైలాన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.