HYD: హైదరాబాద్కు చెందిన ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట రూ.2.58 కోట్లు పోగొట్టుకున్నారు. వాట్సాప్ గ్రూపులో సెబీ నకిలీ సర్టిఫికెట్లతో 500% లాభాలంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. 19 లావాదేవీల ద్వారా ఆమెతో భారీగా పెట్టుబడి పెట్టించారు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.