KDP: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి శనివారం ప్రొద్దుటూరులో DYFI ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించి, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసై యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.