SDPT: కురుమ కుల అభివృద్ధికి విద్యా ప్రధాన ఆయుధమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం సిద్దిపేటలో కురుమ ఉద్యోగుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. సమాజంలో మార్పు రావాలంటే విద్య తోపాటు అందరిలో ఐక్యత ముఖ్యమన్నారు. కురమ కులస్థులు అందరూ ఒక తాటిపై నడవాలి అన్నారు.