ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) బంజారాల దీక్షభూమి వద్ద ఆదివారం సంత్ ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో గురుకృప దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి లంబాడి-బంజారాలు భారీ ఎత్తున పూజల కోసం వస్తారు. ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భోగ్ భండార్ సమర్పిస్తారు. అఖిల భారత బంజారా సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు.