KKD: తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు మనందరికీ గర్వకారణమని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు. శనివారం కే.ఓ. మల్లవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జోడెడ్ల బండి ఎక్కి అందరినీ ఉత్సాహపరిచారు. సంక్రాంతి పండుగతో ప్రతి ఇంటి లోగిలి శోభాయమానంగా కళకళలాడాలని ఆమె ఆకాంక్షించారు.