గుంటూరులోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నుంచి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగనున్నాయని మేయర్ కావెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం రాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, తెలుగు సంస్కృతిని చాటిచెప్పేలా ఈ వేడుకలు ఉంటాయన్నారు. నగర ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై ఈ సంబరాలను విజయవంతం చేయాలని మేయర్ కోరారు.