KMM: ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఆకాశాన్ని అంటాయి. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. జిల్లాలో స్కిన్లెస్ చికెన్ కేజీ రూ.302కి చేరుకోగా, కేజీ స్కిన్ చికెన్ ధర 265గా ఉంది. కాగా ఇప్పుడే ఈ స్థాయిలో చికెన్ ధరలు ఉంటే, సంక్రాంతికి ఇంకెంత పెరుగుతాయోనని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.