కర్నూలులోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపును వేగవంతం చేయనున్నట్లు కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి రెండో విడత ప్రత్యేక స్వచ్ఛత డ్రైవ్ ప్రారంభమవుతుందని చెప్పారు. 7, 12, 14 డివిజన్లలోని 127 ఖాళీ స్థలాల్లో 15 జేసీబీలతో వంద శాతం తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇతర డివిజన్లలోనూ పనులు చేపడతామన్నారు.