W.G: భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.