AP: అమరావతి క్రమంగా రూపురేఖలు దిద్దుకుంటోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమరావతి అంటే గుంటూరు, గన్నవరం, విజయవాడ, తాడికొండ అని..CM చంద్రబాబు చర్యలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని పేర్కొన్నారు. అమరావతి పూర్తిగా అభివృద్ధి చెంది మంచి పేరులోకి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రాజధానిపై అనవసర వివాదాలు వద్దు అని, అమరావతి అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉందని చెప్పారు.