TG: సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు మొట్టికాయలు వేసినా సర్కారు తీరు మారలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. థియేటర్లలో కంటే సచివాలయంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే ధరల పెంపు జీవో ఇచ్చారని విమర్శించారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిదని ఎద్దేవా చేశారు. నచ్చిన వారి సినిమాలకు అనుమతి ఇస్తారా అని ప్రశ్నించారు.