KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం బకాయిలు రూ.56.70 లక్షలు నెలరోజుల్లో వసూలు చేసినట్లు ఆలయ ఛైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఛైర్మన్ నారాయణరెడ్డి అధ్యక్షతన ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో కుంభాభిషేకం, రంగులు వేయాలని నిర్ణయించారు.