NLG: దాబా నిర్వహణ కంటే, డ్రగ్స్ అమ్మకం పైనే లాభాలు గడిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ దందా పోలీసులు చేదించగా పలు విషయాలు తెలుస్తున్నాయి. ‘ఓపీఎం పాపి హస్క్’ కిలో రూ.1800కు కొనుగోలు చేసి ట్రక్కు డ్రైవర్లకు ఆరువేలకు విక్రయిస్తున్నట్లు పట్టుబడ్డ దాబా నిర్వాహకుడు పోలీసులకు తెలిపాడు. నీటిలో కలుపుకుని డ్రైవర్లు దీనిని సేవిస్తారని నిందితుడు వివరించాడు.