MDK: పాపన్నపేట మండలం ఏడుపాయలలో ఆదివారం ప్రధానార్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్య మాసం కృష్ణపక్షం అష్టమి భాను వాసవి పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు.