ASF: సిర్పూర్-కౌటల (వెంకట్రావుపేట్ రైస్ మిల్లు దగ్గర) మార్గమధ్యలో మంగళవారం బైక్-ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో కౌటల పర్యటన నిమిత్తం వెళ్తున్న ఎమ్మెల్సీ దండే విఠల్ గమనించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దగ్గరుండి క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.