KKD: తుని నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలంలో బీసీ, కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య కోరారు. ఈ మేరకు అమరావతిలో సంక్షేమ శాఖ మంత్రి సవితను ఎమ్మెల్యే యనమల దివ్య కలిసి వినతి పత్రం అందజేశారు. సామాజిక వర్గాల అభివృద్ధికి కమ్యూనిటీ భవనాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే.. మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.