RR: యాలాల మండలంలో ముగ్గురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. SI విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం శివారులో ఫర్దేకుంట వద్ద ముగ్గురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందింది. ఈ మేరకు ఎస్సై విఠల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించారు. వారి నుంచి రూ. 2800 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.