MBNR: హన్వాడ మండల కేంద్రంలోని సంగమేశ్వర దేవాలయ ప్రాంగణంలో రూ. 20 లక్షల MUDA నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాల కోసం ఇలాంటి వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఈ కమ్యూనిటీ హాల్ భవిష్యత్తులో స్థానిక శుభకార్యాలకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు.