MDCL: గండిమైసమ్మ, దుండిగల్ పరిధిలో దాదాపు 600 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని రోడ్లపైనే ఎండబెట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో వర్షాలు వస్తే పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ఇవ్వాలన్నారు.