AP: APSRTC ఉద్యోగ సంఘాలతో స్పెషల్ సీఎస్ సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేటీకరణ, ఆర్టీసీ ఉద్యోగ భద్రత అంశంపై కీలక చర్చ జరిగింది. ప్రైవేటీకరణపై స్పష్టమైన హామీని యూనియన్లు కోరాయి. హామీ లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై యూనియన్లు అభ్యంతరం తెలిపాయి.