SDPT: చేర్యాల మండలంలోని తాడూర్ గ్రామంలో మత్తు పదార్థాల నియంత్రణే లక్ష్యంగా ఎస్సై అపూర్వ రెడ్డి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు చేశారు. గ్రామంలోని ప్రైమరీ, సెకండరీ పాఠశాలలు, కిరాణా షాపులు, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్సై హెచ్చరించారు. యువత మత్తుకు దూరంగా ఉండాలన్నారు.