TG: హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ఫిన్టెక్ సంస్థ ఫోన్ పే రూపే ఆన్-ది-గో కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కార్డు ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. దీనిని హైదరాబాద్ మెట్రో టికెట్ కౌంటర్ల వద్ద విక్రయించవచ్చు. ఈ కార్డులో గరిష్టంగా రూ.2000 వరకు బ్యాలెన్స్ వేసుకోవచ్చు. ఒకేసారి రూ.500 వరకు లావాదేవీలు చేసుకోవచ్చు.