ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చికెన్, మటన్ ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ. 280కి చేరుకుంది. స్కిన్‌తో కూడిన చికెన్ కేజీ రూ. 260గా ఉంది. అలాగే కేజీ గొర్రె మాంసం రూ. 700గా ఉండగా, మేక మాంసం ధర రూ. 800 నుంచి రూ. 900 వరకు పలుకుతోందని మాంసం విక్రయదారులు తెలిపారు. ప్రాంతం బట్టి ధరల్లో కొద్దిగా తేడా ఉండవచ్చని వారు పేర్కొన్నారు.