శ్రీ భాష్యం విజయసారథి..సుప్రసిద్ధ కవి. స్వస్థలం కరీంనగర్ జిల్లా చెల్పూరు గ్రామం. సంస్కృత భాషను సామాన్యులకు అర్థమయ్యేలా తన రచనలు చేశారు. శబరి ప్రతీక్ష అనే నవలతో ఆధునిక సంస్కృత సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించారు. బొమ్మకల్ వద్ద ఉన్న వరదరాజస్వామి దేవాలయంలో సంస్కృత భాష ప్రచారానికి వేదికలను ప్రారంభించారు. సాహిత్యంలో ఆయన చేసిన సేవలకుగానూ కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.