KRNL: ఈనెల 14న కర్నూలు బి.క్యాంప్ క్రీడా మైదానంలో అండర్-15 విభాగంలో ఉమ్మడి జిల్లాస్థాయి బాలికలు, సీనియర్ మహిళల రగ్బీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, సురేందర్ వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 19 నుంచి 22 వరకు నిర్వహించే ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొంటారన్నారు.