E.G: నేడు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ‘జన్ సున్ వాయీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి టి. శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9:30 గంటలకు మహిళలకు సంబంధించిన సమస్యలను చర్చించి వారి నుంచి అర్జీలు స్వీకరిస్తారు.