ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో మార్చి 31లోపు సరైన ఇన్వెస్ట్మెంట్లతో పన్ను ఆదా చేసుకోండి. 80C కింద ELSS, PPFలలో రూ.1.5 లక్షల వరకు, NPS (80CCD) ద్వారా అదనపు మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80Dలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియానికి 50 వేలు, 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై రూ.2 లక్షల వరకు డిడక్షన్స్ క్లెయిమ్ చేయవచ్చు. అలాగే 80G కింద విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది.