సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలోని గుడ్డం కోనేరు అభివృద్ధి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం 1.50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ పనులను దగ్గరుండి పరిశీలించారు. కోనేరు ఆధునికీకరణ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.