ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ లుక్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అయింది. వెనుక నుంచి ఉన్న ఆ ఆకృతి ప్రభాస్దేనని ఫ్యాన్స్ భ్రమపడ్డారు. అయితే, ఆ ఫొటో ప్రభాస్ది కాదని, తనది అని నటుడు శివ గణేష్ క్లారిటీ ఇచ్చాడు. అది ఎలా ప్రభాస్ ఫొటోగా వైరల్ అయిందో తనకు అర్థం కాలేదని, వెనక నుంచి చూస్తే లుక్స్ అలాగే ఉన్నాయని చాలామంది చెప్పారని తెలిపాడు. దీంతో ఈ వార్తలకు చెక్ పడింది.