KRNL: పెద్దకడబూరులోని మండల పరిషత్ ఆఫీస్ ముందు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. సీపీఐ నేత వీరేష్, రైతు సంఘం నేత మబ్బు అంజినేయ మాట్లాడుతూ.. సంబంధిత అధికారుల ఆఫీసు ముందే పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి అస్తవ్యస్తంగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని, సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవో ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు.