JN: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణలో పాలన విధానాల అమలు అంశాలను నేర్చుకుని గ్రామాల అభివృద్ధిలో తోడ్పడాలన్నారు. శిక్షణకు ప్రతీ ఒక్కరు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పాల్గొన్నారు.