AP: కంటెంట్ క్రియేషన్‌ను ప్రోత్సహించేందుకు అమరావతిలో ‘క్రియేటివ్ సిటీ’ని ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. AI, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. పాపికొండలు, సూర్యలంకను గోవాలా, గండికోటను భారత్‌కే తలమానికగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తిమ్మమ్మ మర్రిమాను, కంభం చెరువు వంటి చారిత్రక ప్రదేశాల్లో మౌలిక వసతులు ఆకర్షించాలన్నారు.